15, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి t – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Writer: Pooja 05:38 PM, 15 నవంబర్, 2026
సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి t – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఉపాధ్యాయులు కేవలం తరగతి గదుల్లో పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా విద్యార్థుల కుటుంబ, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సామాజిక పరివర్తన సాధ్యమని, తెలంగాణ యువతను ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని ఇంజినీరింగ్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్‌టీఎఫ్) రాష్ట్ర విద్యా మహాసభలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల ఎదుగుదలపై పాఠశాల బోధనతో పాటు ఇంటి వాతావరణం, పౌష్టికాహారం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, సామాజిక నేపథ్యం కూడా ప్రభావం చూపుతాయని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు.

ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని భట్టి తెలిపారు. వేలాది మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, సుమారు 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు 30 వేల నుంచి 35 వేల మందికి బదిలీలు చేపట్టామని వివరించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 105 యంగ్ ఇండియా పాఠశాలలకు అనుమతులు మంజూరు చేశామని, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఒక్కో పాఠశాలను 20 నుంచి 25 ఎకరాల్లో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. విద్యతో పాటు వసతి, క్రీడలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని సామాజిక వర్గాల పిల్లలు ఒకే ప్రాంగణంలో చదువుకునేలా ఈ పాఠశాలలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే దాదాపు 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను సెమీ రెసిడెన్షియల్ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులకు రవాణా, యూనిఫాం, బూట్లు, టై, పుస్తకాలు, బ్యాగులు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించి, సాయంత్రం ఇంటికి పంపిస్తామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామని తెలిపారు.

విద్యార్థుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని భట్టి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇప్పటివరకు 8 లక్షల ఇళ్లకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, వృద్ధులకు పెన్షన్లు వంటి పథకాల గురించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల కోసం క్యాష్‌లెస్ హెల్త్ కార్డు సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చామని, పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లిస్తూ నెలకు రూ.750 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు విడుదల చేస్తున్నామని వివరించారు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి తత్వవేత్తలను ప్రస్తావిస్తూ ఉపాధ్యాయులు కూడా భవిష్యత్ తరాలు గర్వించేలా సేవలందించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు సామాజిక పరివర్తనకు మార్గదర్శకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వారు ప్రస్తావించే సమస్యలను సానుకూలంగా పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి, ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, ప్రధాన కార్యదర్శి పోచయ్య, ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేలుళ్లు, సైరన్లతో బహ్రెయిన్‌లో కలకలం

పేలుళ్లు, సైరన్లతో బహ్రెయిన్‌లో కలకలం

నగరంలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆమోదం

నగరంలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆమోదం

ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్‌కు వీరాభిమానినే - శివజ్యోతి

ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్‌కు వీరాభిమానినే - శివజ్యోతి

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కుటుంబ ఆధారిత హెరాయిన్ ముఠా గుట్టురట్టు

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కుటుంబ ఆధారిత హెరాయిన్ ముఠా గుట్టురట్టు

హరీశ్ రావు తండ్రి సంవత్సరీక కార్యక్రమానికి హాజరైన కేసీఆర్

హరీశ్ రావు తండ్రి సంవత్సరీక కార్యక్రమానికి హాజరైన కేసీఆర్

బహ్రెయిన్‌లోని అమెరికా రాడార్ వ్యవస్థపై ఇరాన్ దళాల దాడి

బహ్రెయిన్‌లోని అమెరికా రాడార్ వ్యవస్థపై ఇరాన్ దళాల దాడి

ట్యాగ్లు
భట్టి విక్రమార్కతెలంగాణ విద్యారంగంఉపాధ్యాయుల పాత్రయంగ్ ఇండియా స్కూళ్లుతెలంగాణ పబ్లిక్ స్కూళ్లువిద్యా సంస్కరణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి t – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
జనరల్

సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి t – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

యూపీ సీఎంగా బాధ్యతలు చేపడితే టోల్ ఛార్జీలు రద్దు చేస్తా - చంద్రశేఖర్ ఆజాద్
రాజకీయాలు

యూపీ సీఎంగా బాధ్యతలు చేపడితే టోల్ ఛార్జీలు రద్దు చేస్తా - చంద్రశేఖర్ ఆజాద్

ఓటీటీలోకి హారర్ మూవీ ‘418’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి హారర్ మూవీ ‘418’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్
సినిమాలు

ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్

పేలుళ్లు, సైరన్లతో బహ్రెయిన్‌లో కలకలం
జనరల్

పేలుళ్లు, సైరన్లతో బహ్రెయిన్‌లో కలకలం

బీఆర్‌ఎస్‌ అక్రమాలను కవిత స్వయంగా బయటపెడుతున్నారు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ అక్రమాలను కవిత స్వయంగా బయటపెడుతున్నారు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

గెలాక్సీ ఎస్27 సిరీస్ ఉత్పత్తి ప్రణాళికలో ఆసక్తికర మార్పులు
టెక్నాలజీ

గెలాక్సీ ఎస్27 సిరీస్ ఉత్పత్తి ప్రణాళికలో ఆసక్తికర మార్పులు

పల్నాడు జిల్లాలోని జొన్నలగడ్డ గ్రామంలో సర్పంచ్ పదవికి భారీ వేలం
రాజకీయాలు

పల్నాడు జిల్లాలోని జొన్నలగడ్డ గ్రామంలో సర్పంచ్ పదవికి భారీ వేలం

నగరంలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆమోదం
జనరల్

నగరంలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆమోదం

ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్‌కు వీరాభిమానినే - శివజ్యోతి
జనరల్

ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్‌కు వీరాభిమానినే - శివజ్యోతి

‘రామాయణ’లో సీతను యోధురాలిగా చూపించడానికి కారణమిదే - నితేష్ తివారీ
సినిమాలు

‘రామాయణ’లో సీతను యోధురాలిగా చూపించడానికి కారణమిదే - నితేష్ తివారీ

జౌల్జీబీ జాతరలో రాజకీయ రగడ..మైక్‌ను విసిరికొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
రాజకీయాలు

జౌల్జీబీ జాతరలో రాజకీయ రగడ..మైక్‌ను విసిరికొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!