

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 235 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు కేబినెట్‌కు వివరించారు. ఈ పరిస్థితులపై తీసుకోవాల్సిన ఉపశమన చర్యలను కేబినెట్ సబ్‌కమిటీలో మరింతగా చర్చించాలని నిర్ణయించారు. అలాగే త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వివిధ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని సీఎం సూచించారు.
వర్షాభావ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కరువు మండలాలను అధికారికంగా ప్రకటించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం కోరాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించేందుకు కేంద్రమంత్రులను కలిసి సహాయం కోరాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. వ్యవసాయం, తాగునీరు, సాగునీరు తదితర రంగాలపై ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపశమన చర్యలపై సూచనలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!