
జనరల్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సెప్టెంబర్ 7న అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ తరఫున అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించింది.
విచారణ చేపట్టిన జస్టిస్ టి. మాధవీ దేవి.. ఘటనకు సంబంధించిన పోలీసు అధికారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. విచారణ, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే అసెంబ్లీ నిబంధనలను సభ్యులు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌దేనని, పోలీసులకు కాదని కోర్టు స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!