
ఆరోగ్యం

తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్, ప్రస్తుతం విధుల్లో ఉన్న పలువురు పోలీసు ఉన్నతాధికారులకు కేటాయించిన 26 బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను ఉపసంహరించింది. అలాగే, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను కూడా వెనక్కి తీసుకుంది.
అదే సమయంలో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు కల్పిస్తున్న భద్రతను కూడా పునఃసమీక్షించింది. మొత్తం 67 మంది ప్రముఖులకు కేటాయించిన గన్మెన్ల సంఖ్యను తగ్గిస్తూ, ఎక్కువ మందికి వన్ ప్లస్ వన్ భద్రతకే పరిమితం చేసింది. భద్రతా వనరుల సమర్థ వినియోగం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!