

తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మను ట్యాంక్‌బండ్‌పై భారీగా నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్మారక స్తూపం నుంచి భారీ మహిళల బతుకమ్మ ర్యాలీ ప్రారంభమై ట్యాంక్‌బండ్‌కు చేరుకోనుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రధాన వేడుకలు కొనసాగనున్నాయి. వేలాది మంది మహిళలు పాల్గొనే ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ డైవర్షన్లు, బారికేడింగ్, లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ ఘాట్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జన ఏర్పాట్లు చేయనున్నారు.
హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మల ఏర్పాటు, విద్యుత్ అలంకరణలు చేపట్టనున్నారు. రవీంద్రభారతిలో 10 రోజుల పాటు ప్రత్యేక బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లోనూ బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక బతుకమ్మ లోగోను రూపొందిస్తోంది. ఇందులో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అంశాన్ని కూడా పొందుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!