28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

Writer: Chandrika 10:04 PM, 28 ఆగస్టు, 2026
తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలో నెల రోజుల్లో వరుసగా మూడు చిరుతలు మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. జూలై 28న 16 ఏళ్ల మగ జాగ్వార్‌ ‘లావా’ మృతి చెందింది. 2017 నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న లావాకు చికిత్స అందించినప్పటికీ వ్యాధి చివరి దశకు చేరుకోవడంతో మల్టీ ఆర్గన్‌ ఫెయిల్యూర్‌ కారణంగా మృతి చెందినట్లు జూ అధికారులు తెలిపారు. అనంతరం ఆగస్టు 15న సుమారు 17 ఏళ్ల మగ చిరుత ‘సత్య’ మృతి చెందింది. పోస్టుమార్టంలో అస్ఫిక్సియా, తీవ్రమైన రక్తహీనత ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఆగస్టు 28న సుమారు 16 ఏళ్ల ఆడ చిరుత ‘విముడ’ కూడా మృతి చెందింది. గండికోట నుంచి రక్షించిన విముడ 2014 నుంచి తిరుపతి జూలో సంరక్షణలో ఉంది. పోస్టుమార్టంలో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, తీవ్రమైన గ్యాస్ట్రైటిస్‌ ఉన్నట్లు గుర్తించారు. మూడు జంతువుల పోస్టుమార్టం నివేదికలను ఉన్నతాధికారులకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూలో 1,153 జంతువులు, పక్షులు సంరక్షణలో ఉన్నాయని, నిపుణులైన వైద్యులు, బయాలజిస్టుల పర్యవేక్షణలో ప్రతిరోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని క్యూరేటర్‌ వెల్లడించారు. 16–17 ఏళ్ల వయసున్న రెండు చిరుతలు సహజ కారణాలతోనే మృతి చెందినట్లు తెలిపారు. జంతువుల సంరక్షణలో సిబ్బంది నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కాంట్రాక్టర్‌ నుంచి రావాల్సిన మందుల నిల్వలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, బ్యూటాక్స్‌ సహా అవసరమైన మందులన్నింటినీ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. మందుల వ్యవహారంపై అంతర్గత విచారణ కొనసాగుతోందని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

ట్యాగ్లు
తిరుపతి జూశ్రీ వెంకటేశ్వర జూచిరుతల మృతిజాగ్వార్‌ మృతిలావా జాగ్వార్‌సత్య చిరుతవిముడ చిరుతజంతువుల సంరక్షణజూ ఆరోగ్యంజంతు సంక్షేమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..
రాజకీయాలు

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..
జనరల్

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌
క్రీడలు

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..
జనరల్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..
జనరల్

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..
క్రీడలు

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..
జనరల్

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...
జనరల్

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..
జనరల్

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!