

మేషం: ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనులు సులభంగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవం, మంచి గుర్తింపు లభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించడం శుభప్రదం.
వృషభం: అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శారీరక ఉత్సాహం, ధైర్యం, సౌఖ్యం పెరుగుతాయి. మంచిపేరు, భోజన సౌఖ్యం లభిస్తాయి. శ్రీమహావిష్ణువును ఆరాధించడం మేలు చేస్తుంది.
మిథునం: పట్టుదలతో ముందుకు సాగి ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. అనవసర వాదవివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
కర్కాటకం: ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. కొన్ని సందర్భాల్లో నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది.
సింహం: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. మానసికంగా ధైర్యంగా వ్యవహరిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.
కన్య: మనశ్శాంతిని కాపాడుకోవడం అవసరం. ప్రారంభించిన పనులకు ఎక్కువ శ్రమ అవసరమవుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి. విష్ణు సహస్రనామ పారాయణం శుభఫలితాలను ఇస్తుంది.
తుల: అనుకూల ఫలితాలు లభిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామస్మరణ శుభప్రదం.
వృశ్చికం: మానసిక సంతోషం ఉంటుంది. మీ రంగంలో మంచి గుర్తింపు పొందుతారు. ఒక శుభవార్త ఉత్సాహంతో పాటు ధైర్యాన్ని పెంచుతుంది. స్థానమార్పునకు సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. దుర్గాదేవిని స్తుతించడం మంచిది.
ధనుస్సు: దృఢమైన సంకల్పంతో చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉత్సాహంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పనిభారం, ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉంది. అనవసర వ్యయాలను తగ్గించాలి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
మకరం: మీ రంగంలో పెద్దల ఆదరణ, ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు సంయమనం అవసరం. ఆత్మవిశ్వాసాన్ని తగ్గనివ్వకుండా ముందుకు సాగాలి. గణపతిని ఆరాధించడం శుభప్రదం.
కుంభం: సుఖసంతోషాలు లభిస్తాయి. మిత్రుల సహకారం ఉపయోగపడుతుంది. ఒక ముఖ్యమైన విషయంపై పెద్దలను సంప్రదిస్తారు. ఆశించిన విధంగా అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి పరిస్థితులు ఉంటాయి. సూర్యారాధన శుభదాయకం.
మీనం: ఆశించిన ఫలితాలను సాధించడానికి కొంత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. సహనం, క్షమాగుణం వల్ల బంధాలు మరింత బలపడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి కోసం పట్టుదలతో ప్రయత్నించాలి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!