
రాజకీయాలు

గురునానక్ దేవ్ 557వ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్లో నేడు మతపరమైన ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
అశోక్ బజార్ గురుద్వారా నుంచి ఊరేగింపు ప్రారంభమై అఫ్జల్గంజ్, ఎస్.ఏ. బజార్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలి మీదుగా శంకర్ షేర్ హోటల్ వరకు సాగనుంది. అనంతరం తిరిగి గురుద్వారాకు చేరుకోనుంది. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!