

నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నైజీరియా వైమానిక దళానికి చెందిన ఏటీఆర్-42 సైనిక విమానం సోమవారం బెనిన్ సిటీ నుంచి లాగోస్‌కు సాధారణ మిషన్‌లో వెళ్తుండగా ఒండో రాష్ట్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 32 మంది మృతి చెందారు. మృతుల్లో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఉదయం 8.13 గంటలకు విమానంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సంబంధాలు తెగిపోయాయి. అనంతరం భారీ స్థాయిలో గాలింపు చేపట్టగా, ఇగ్బోకొడా సమీపంలోని నౌకాదళ స్థావరం వద్ద విమానం శకలాలను గుర్తించారు.
చిత్తడి నేల ప్రాంతంలో విమానం కూలిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్థానికులు కూడా సహాయక బృందాలకు సహకరించారు. ప్రమాదంపై నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు తీవ్ర విచారం వ్యక్తం చేసి, ఘటనకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైమానిక దళాన్ని ఆదేశించారు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయా, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రమాదానికి ముందు పైలట్ నుంచి ఏదైనా అత్యవసర సమాచారం వచ్చిందా వంటి అంశాలను దర్యాప్తు అధికారులు పరిశీలించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!