

రష్యా, ఉక్రెయిన్ మధ్య తక్షణమే ‘ఎనర్జీ సీజ్‌ఫైర్’ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. విద్యుత్, చమురు, సహజ వాయువు వంటి ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పర దాడులను నిలిపివేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ఇరుపక్షాలకు సూచించారు. ఈ మేరకు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ప్రకటన చేశారు.
అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. తమ దేశంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేయడం సాధ్యమేనని, అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. రష్యా తమ ఇంధన కేంద్రాలపై దాడులను ఆపితే, ఆ దేశంలోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడులను నిలిపివేసేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటన వెలువడింది. అయితే, ఎనర్జీ సీజ్‌ఫైర్‌పై రష్యా, ఉక్రెయిన్ అధికారికంగా స్పందించలేదు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!