

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రముఖ నిర్మాత అనూప్ మోహన్ కలిసి ఓ ప్రతిష్ఠాత్మక దేశభక్తి ప్రధాన పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థపై రూపొందనున్న ఈ చిత్రం ఆ సంస్థకు మూడో సినిమా కానుంది. భారతదేశ స్ఫూర్తి, వీరత్వం, జాతీయ గర్వాన్ని ప్రతిబింబించే కథాంశంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ముహూర్త కార్యక్రమాన్ని రేపు అయోధ్యలోని పవిత్ర శ్రీరామ జన్మభూమి ఆలయంలో నిర్వహించనున్నారు. ఈ శుభకార్యానికి భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన విశిష్ట అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు.
ముహూర్త కార్యక్రమంతో పాటు సినిమా అధికారిక టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. బాలీవుడ్‌తో పాటు ఇతర ప్రాంతీయ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. దేశభక్తి నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!