
జనరల్

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగచైతన్య శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఆలయానికి చేరుకున్న నాగచైతన్యకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. దర్శనం పూర్తయ్యాక వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని అందజేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!