
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. ఈ ఒప్పందంతో ఇరాన్‌పై అమలులో ఉన్న అమెరికా నావికా దిగ్బంధనానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్, శాంతి చర్చలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు.
అలాగే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ఇకపై ఎలాంటి అదనపు ఆంక్షలు లేదా సుంకాలు లేకుండా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ నౌకాయాన సంస్థలు తమ కార్యకలాపాలను పునఃప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు. మరోవైపు ఈ ప్రకటనపై ఇరాన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!