

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముద్రించిన 2027 క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లో సులభంగా బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్లు TTD Devasthanams, Tirumala Tirupati Balaji ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తిరుపతి, తిరుమల, తిరుచానూరులోని టీటీడీ ప్రచురణల విక్రయ విభాగానికి చెందిన 12 కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌తో పాటు విజయవాడ, చెన్నై, వేలూరు, బెంగళూరు, దిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ వీటిని కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది.
మరోవైపు, ఈ నెల 16న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముందస్తు అంకురార్పణ కార్యక్రమాన్ని 15వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు చేపట్టనున్నారు. పుష్పయాగం నేపథ్యంలో 16న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజున తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ మార్పులను గమనించాలని సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!