
సినిమాలు

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పదమూడేళ్ల క్రితం నమోదైన ఓ కేసులో ఆమెను సాక్షిగా విచారించాల్సి ఉందని, అందుకోసం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విచారణకు హాజరయ్యేందుకు అనుకూలమైన తేదీ, స్థలాన్ని స్వయంగా నిర్ణయించుకోవాలని ఢిల్లీ పోలీసులు ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమకు అందుబాటులో ఉన్న తేదీ, ప్రదేశాన్ని తెలియజేయాలని కోరినట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, విచారణకు సంబంధించిన తదుపరి పరిణామాలపై స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!