

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలు, ఆర్జిత సేవల రద్దుకు సంబంధించి టీటీడీ వివరాలను ప్రకటించింది. ఈనెల 8వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే, ఈనెల 15వ తేదీన పుష్పయాగానికి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఈనెల 16వ తేదీన పుష్పయాగం జరగనుంది. సుమారు 7 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన చేయనున్నారు. ఈ నేపథ్యంలో 16వ తేదీన కూడా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇక డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. మొదటి మూడు రోజులకు సంబంధించిన దర్శన టోకెన్లను ఈ-డిప్ విధానంలో కేటాయిస్తారు. మిగిలిన ఏడు రోజుల పాటు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!