20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

Writer: Harika S 03:46 PM, 20 ఆగస్టు, 2026
శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ రోజుల్లోనే 80 వేల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తుండటంతో వారికి అందించే సేవలను మరింత మెరుగుపర్చేందుకు శ్రీవారి సేవకుల పనితీరును అంచనా వేసే కొత్త గ్రేడింగ్‌ విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం రోజుకు సుమారు 3,000 నుంచి 3,500 మంది శ్రీవారి సేవకులు వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు.

కొత్త విధానంలో సేవకుల హాజరు, పనితీరు, భక్తులను పలకరించే తీరు, వారికి అందించే సేవలను పర్యవేక్షించి గ్రేడింగ్‌ ఇవ్వనున్నారు. అప్పగించిన పనిని సమర్థంగా పూర్తి చేయడంతో పాటు అదనపు బాధ్యతలు నిర్వర్తించే వారికి ‘అత్యుత్తమం’, విధులను సక్రమంగా నిర్వహించే వారికి ‘ఉత్తమం’, అప్పగించిన పనిని సరిగా నిర్వహించని వారికి తక్కువ గ్రేడ్‌ ఇవ్వనున్నారు. అత్యుత్తమ గ్రేడింగ్‌ పొందిన బృందాలను బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల సమయంలో సేవలకు వినియోగించుకోనున్నారు.

సేవకుల పనితీరును పర్యవేక్షించేందుకు టీటీడీ ప్రిన్సిపల్‌ సూపర్‌వైజర్లను కూడా నియమించింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన గెజిటెడ్‌ అధికారులు, ఆపై స్థాయి అధికారులు, ప్రముఖ సంస్థలు, బ్యాంకుల్లో ఉన్నత హోదాల్లో పనిచేసినవారిని ఇందుకోసం ఎంపిక చేశారు. నెలకు ఐదుగురు ప్రిన్సిపల్‌ సూపర్‌వైజర్లు విధులు నిర్వహించనున్నారు. ఒక్కొక్కరి కింద 10 నుంచి 15 మంది గ్రూప్‌ సూపర్‌వైజర్లు ఉంటారు. వీరు రోజువారీ పనితీరు వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు.

గ్రాడ్యుయేషన్‌ అర్హత ఉన్నవారిని గ్రూప్‌ సూపర్‌వైజర్లుగా ఎంపిక చేస్తున్నారు. వీరు 15 రోజుల పాటు విధుల్లో ఉంటారు. ఒక్కో గ్రూప్‌ సూపర్‌వైజర్‌ 10 నుంచి 15 శ్రీవారి సేవకుల బృందాలను పర్యవేక్షిస్తారు. ఒక్కో బృందంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. సేవకుల హాజరు, పనితీరు, భక్తులతో వ్యవహరించే తీరును పరిశీలించి ప్రతిరోజూ యాప్‌లో వివరాలను నమోదు చేసి ప్రిన్సిపల్‌ సూపర్‌వైజర్లకు అందజేస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు...

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు...

ట్యాగ్లు
టీటీడీతిరుమలశ్రీవారి సేవకులుభక్తుల సేవలుగ్రేడింగ్‌ విధానంతిరుపతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
జనరల్

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి
జనరల్

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?
షోస్

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?
జనరల్

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన
జనరల్

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్
జనరల్

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

అగ్నిపరీక్ష 2’లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్ల స్పెషల్‌ ఎంట్రీ?
షోస్

అగ్నిపరీక్ష 2’లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్ల స్పెషల్‌ ఎంట్రీ?

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం
జనరల్

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
జనరల్

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
జనరల్

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!