

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు తిరుపతిలో సాధారణ భక్తులకు జారీ చేసే ఉచిత సర్వదర్శనం టైమ్‌స్లాట్ (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల నిలిపివేతను మరో నాలుగు రోజుల పాటు పొడిగించారు. సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు టోకెన్ల జారీ నిలిపివేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 24న 25వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు కొనసాగనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!