

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాల పంపిణీకి తేదీలు ఖరారయ్యాయి. నవంబరు 7 నుంచి 20వ తేదీ వరకు తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద ఉన్న కొత్త జాబిలి భవనంలో ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. అర్హులైన పింఛన్‌దారులు తమ స్మార్ట్ కార్డును చూపించి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ ప్రసాదాన్ని పొందవచ్చు.
పింఛన్ చెల్లింపు ఉత్తర్వుల (పీపీఓ) నంబర్ల ఆధారంగా విడతల వారీగా ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. నవంబరు 7న 164 నుంచి 3,250 వరకు, నవంబరు 9 నుంచి 13 వరకు 3,251 నుంచి 9,050 వరకు, నవంబరు 16 నుంచి 19 వరకు 9,051 నుంచి 12,550 వరకు ఉన్న పింఛన్‌దారులకు ప్రసాదాలు అందిస్తారు. నవంబరు 20న 12,551 నుంచి ఆ తర్వాతి నంబర్లు కలిగిన మిగిలిన పింఛన్‌దారులకు పంపిణీ చేస్తారు. విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు కేటాయించిన తేదీల్లో స్మార్ట్ కార్డులతో హాజరై శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని టీటీడీ కోరింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!