

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్లు, టోకెన్ల విడుదలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. నవంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. భక్తులు నిర్ణీత సమయాల్లో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను టీటీడీ ఈ-డిప్ విధానం ద్వారా కేటాయించనుంది. డిసెంబర్ 20, 21 తేదీల్లో దర్శనానికి సంబంధించిన టోకెన్లు పొందాలనుకునే భక్తులు డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం లాటరీ విధానం ద్వారా టోకెన్లను కేటాయించనున్నారు. దర్శన టికెట్లు, టోకెన్లకు సంబంధించిన వివరాల కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రకటనలను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!