

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత సందీప్ ఎవరితో పనిచేస్తారనే విషయంపై కొంతకాలంగా సినీ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు లేదా అల్లు అర్జున్‌తో ఆయన తదుపరి సినిమా ఉంటుందని ప్రచారం సాగింది. ఈ ఇద్దరు అగ్ర హీరోలతో సందీప్ కలయిక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తాజాగా దర్శకుడు ఇచ్చిన సమాధానంతో ఈ ఊహాగానాలకు తెరపడినట్లయింది. తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఆయన స్పష్టతనిచ్చారు. దీంతో అభిమానుల్లో మరోసారి ‘యానిమల్’ సీక్వెల్‌పై ఆసక్తి పెరిగింది.
బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. ‘స్పిరిట్’ చిత్రీకరణ పూర్తయిన వెంటనే ‘యానిమల్ పార్క్’ పనులు ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. అంటే మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల కంటే ముందుగా రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ కొనసాగింపునే పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా ‘స్పిరిట్’పైనే దృష్టి పెట్టారు. ఇందులో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత ‘యానిమల్ పార్క్’ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!