12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

Writer: Chandrika 10:57 PM, 12 ఆగస్టు, 2026
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

సముద్ర కోతతో తీవ్రంగా ప్రభావితమవుతున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ.323 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న తీర రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్‌కు అప్పగిస్తూ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ నిధి (ఎన్‌డీఎంఎఫ్) ఆమోదంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్‌డీఎంఏ) నోడల్ ఏజెన్సీగా, ఏపీ మారిటైమ్ బోర్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.

ఐఐటీ మద్రాస్ నిపుణులు శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీరానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు. ఐఐటీ మద్రాస్‌తో ఒప్పంద ప్రక్రియ పూర్తికావడంతో నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, సమీప మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..
ట్యాగ్లు
ఉప్పాడ తీర రక్షణఉప్పాడ తీరంఐఐటీ మద్రాస్పవన్ కళ్యాణ్కాకినాడ జిల్లాసముద్ర కోతఆంధ్రప్రదేశ్తీర రక్షణ గోడవిపత్తు నిర్వహణఏపీ మారిటైమ్ బోర్డు
AdvertisementAdvertisement

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..
జనరల్

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ
సినిమాలు

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...
జనరల్

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి
జనరల్

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్
జనరల్

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?
జనరల్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్
బిజినెస్

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్
బిజినెస్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?
గాసిప్స్

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..
జనరల్

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...
జనరల్

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!