

అరేబియా సముద్రంలో గస్తీ కాస్తున్న అమెరికా నేవీకి చెందిన ఎంహెచ్-60ఎస్ సీహాక్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ ఘటనలో ఒక సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ ఫిఫ్త్ ఫ్లీట్ ధృవీకరించింది. గల్లంతైన ఎయిర్ క్రూమెన్ కోసం శోధన చర్యలు కొనసాగుతున్నాయని, ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు నేవీ తెలిపింది. ఈ హెలికాప్టర్ యూఎస్‌ఎస్ జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
సముద్రంపై హెలికాప్టర్ ల్యాండింగ్ అత్యంత ప్రమాదకరమైందిగా భావిస్తారు. హెలికాప్టర్ పైభాగం బరువుగా ఉండటం వల్ల నీటిలో పడిన వెంటనే తల్లకిందులయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జూన్‌లో హర్మూజ్ సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన కూడా చోటుచేసుకుంది, అయితే అందులోని పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అదే సమయంలో ఇరాన్ అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ప్రకటించడం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలపై మరింత సందేహాలను రేకెత్తిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!