

ఉగ్రవాది గుర్పత్‌వంత్ సింగ్ పన్నూ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో భారత ప్రభుత్వానికి అమెరికా విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది. పన్నూ ఈ కేసులో ప్రతివాదులుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్(రా) మాజీ అధిపతి సమంత్ గోయల్‌తోపాటు పలువురు భారతీయ అధికారుల పేర్లను పేర్కొన్నాడు. తద్వారా వీరందరికీ అమెరికా సమన్లు జారీ చేసినట్లయ్యింది.
గత నెల 9వ తేదీన సదరు సమన్లను అమెరికా విదేశాంగశాఖ.. వాషింగ్టన్‌లోని భారతీయ రాయబార కార్యాలయానికి పంపించింది. గుర్పత్‌వంత్ సింగ్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. తనను హత్య చేయించటానికి భారత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ గతంలో ఆయన కేసు దాఖలు చేశాడు. నిఖిల్‌గుప్తా అనే భారతీయుడిని ఈ మేరకు నియమించారని పేర్కొన్నాడు. ఈ కేసులో అమెరికాలో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో నిఖిల్‌గుప్తా 2023 జూన్‌లో చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో అరెస్టయ్యాడు. అతడిని ఆ దేశం అమెరికాకు అప్పగించింది. కాగా, భారతీయ అధికారులకు అమెరికా సమన్లు జారీ చేయటాన్ని భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!