
గాసిప్స్

వనపర్తి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తాజాగా ఢిల్లీకి చేరాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి తన అనుచరులతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో వనపర్తి కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
మేఘారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిన్నారెడ్డిపై తన ఫిర్యాదును పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో వనపర్తి కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలపై అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!