
జనరల్

రైల్వే సిబ్బంది వెంటనే ప్రభావిత కోచ్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. సాంకేతిక, భద్రతా బృందాలను అప్రమత్తం చేసి అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టినట్లు పేర్కొంది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా వేచి ఉండేందుకు సౌకర్యం, తాగునీరు, ఆహారం అందించడంతో పాటు సహాయం కోసం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
వందేభారత్ ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. పరిస్థితిని రైల్వే అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రయాణికులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు అందిస్తున్నారని పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!