
జనరల్

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. సుదీర్ఘకాలంగా ఉన్న తమ స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను ఇరువురూ గుర్తుచేసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారానికి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించారు.
ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఇరువురూ చర్చించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖల్లో చేపడుతున్న మార్పులు, సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధమవుతున్న సమయంలో ఈ భేటీ చోటుచేసుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!