
గాసిప్స్

ఇండియా టుడే-సీ ఓటర్ తాజా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కు ప్రధాని అభ్యర్థిగా 9.2 శాతం మద్దతు లభించినట్లు వెల్లడైంది. దీంతో తదుపరి ప్రధానిగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారనే జాబితాలో విజయ్ మూడో స్థానంలో నిలిచారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయ్‌కు లభించిన ఈ మద్దతు ఆసక్తికరంగా మారింది.
ఈ జాబితాలో 48.7 శాతం మద్దతుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉండగా, 27.1 శాతంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండో స్థానంలో నిలిచారు. విజయ్‌కు 9.2 శాతం మద్దతు లభించింది. అయితే ఈ సర్వే ఆధారంగా ఈశాన్య భారతదేశంలో విజయ్‌కు ప్రత్యేకంగా అత్యధిక ఆదరణ ఉందనే వాదనలను నిర్ధారించలేమని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!