27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు

Writer: Chandrika 09:24 PM, 27 నవంబర్, 2026
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఈ ప్రాజెక్టు జగన్ ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోయిందని, 2020లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించడంతో పాటు, 2023 మార్చి 22న రూ.2.65 కోట్ల జరిమానా విధించిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలను సమర్థంగా ఎందుకు సవాలు చేయలేదని ప్రశ్నించారు. 2023 ఆగస్టు 11న జారీ చేసిన జీవో నంబర్ 364లో ఈ ప్రాజెక్టును పరిమిత తాగునీటి అవసరాలకే పరిమితం చేశారని, ఇప్పుడు అదే ప్రాజెక్టును రాయలసీమ భవిష్యత్తుకు కీలకమైనదిగా జగన్ అభివర్ణించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. వైసీపీ పాలనలో రాయలసీమకు చెందిన 102 సాగునీటి ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేశారని, డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు శ్రీశైలం, తుంగభద్ర, గోరకల్లు ప్రాజెక్టుల నిర్వహణను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 27 నెలల్లోనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై రూ.13,484 కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ.10,014 కోట్లు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ మరమ్మతులకు రూ.205 కోట్లు మంజూరు చేయడంతో పాటు, 2024 వరదల సమయంలో దెబ్బతిన్న తుంగభద్ర డ్యామ్ గేట్ల ఆధునీకరణ పనులు చేపట్టామని చెప్పారు. హంద్రీ-నీవా ప్రాజెక్టులో సుమారు రూ.3,800 కోట్లతో 738వ కిలోమీటరు వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లినట్లు వివరించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై రూ.12,000 కోట్లు ఖర్చు చేయగా, 2019–24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం వల్ల కృష్ణా జలాలపై ఒత్తిడి తగ్గి, శ్రీశైలం నీటిని రాయలసీమ అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని అన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్జీటీ స్టే విధించినప్పుడు, జరిమానా విధించినప్పుడు, ప్రాజెక్టును తాగునీటి అవసరాలకే పరిమితం చేస్తూ జీవో జారీ చేసినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా రిజర్వేషన్లకు చంద్రబాబు మద్దతు..

మహిళా రిజర్వేషన్లకు చంద్రబాబు మద్దతు..

తమిళనాడు రాజకీయాల్లో కలకలం..

తమిళనాడు రాజకీయాల్లో కలకలం..

డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!

ట్యాగ్లు
నిమ్మల రామానాయుడుజగన్‌మోహన్‌రెడ్డిరాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుజలవనరుల శాఖఎన్జీటీచంద్రబాబు నాయుడుసాగునీటి ప్రాజెక్టులువైఎస్సార్‌సీపీకూటమి ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు
రాజకీయాలు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు

మహిళా రిజర్వేషన్లకు చంద్రబాబు మద్దతు..
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్లకు చంద్రబాబు మద్దతు..

బతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు..
జనరల్

బతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు..

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..
జనరల్

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..
జనరల్

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..

HMDA భూముల వేలానికి స్పందన కరువు..
జనరల్

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?
గాసిప్స్

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..

తమిళనాడు రాజకీయాల్లో కలకలం..
రాజకీయాలు

తమిళనాడు రాజకీయాల్లో కలకలం..

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..
క్రీడలు

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య సుమలత...
జనరల్

బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య సుమలత...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!