
క్రీడలు

విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్కు చెందిన భూముల వేలానికి తొలిరోజే భారీ స్పందన లభించింది. ఈ వేలం ద్వారా రూ.366.33 కోట్ల ఆదాయం సమకూరింది. భూముల విక్రయానికి నిర్ణయించిన రూ.312.48 కోట్ల అంచనా విలువను మించి ఆదాయం రావడం విశేషం. దీంతో వేలం ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.
వేలంలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపడంతో పోటీ నెలకొంది. కొన్ని ప్లాట్లకు గజం ధర రూ.1.80 లక్షలు దాటినట్లు సమాచారం. అంచనా విలువ కంటే అధిక ఆదాయం రావడంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) హర్షం వ్యక్తం చేసింది. ఈ వేలం ఫలితాలు విశాఖలోని స్టీల్ ప్లాంట్ భూములపై కొనుగోలుదారుల ఆసక్తిని ప్రతిబింబిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!