
సినిమాలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏడేళ్లు దాటినా ఇంకా తేలకపోవడంపై ఆయన కుమార్తె వైఎస్ సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. సీబీఐ దర్యాప్తు పూర్తయినప్పటికీ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, బాధ్యులపై పూర్తి స్పష్టత రాలేదని ఆమె పేర్కొన్నారు.
వివేకా హత్య కేసులో కోట్ల రూపాయల మనీ ట్రయల్‌తో పాటు హత్య వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్న ‘పెద్ద కుట్ర’ కోణాన్ని కూడా వెలికితీయాలని సునీత రాష్ట్రపతిని కోరారు. కేసులో సమగ్ర దర్యాప్తు జరిగేలా సంబంధిత సంస్థలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నేళ్లు గడిచినా కేసు కొలిక్కి రాకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!