
జనరల్

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన ఊరేగింపులో వైజాగ్‌కు చెందిన ఓ గ్రూప్ కొండచిలువతో ప్రదర్శన నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. తమ ప్రదర్శనలో ప్రత్యేకత కోసం గ్రూప్‌లోని ఓ యువతి కొండచిలువతో కలిసి డ్యాన్స్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రూప్ కదలికలను ఐదు రోజుల పాటు ట్రాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.
అనంతరం గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (GHSPCA) సిబ్బంది, మధురానగర్ పోలీసులు కలిసి చర్యలు చేపట్టి గ్రూప్ నుంచి కొండచిలువతో పాటు ఓ కోడిని రక్షించారు. కొండచిలువకు నోటి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు దానిని పశువైద్యుల సంరక్షణలో ఉంచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!