
సినిమాలు

వరంగల్‌కు కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతున్న నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ కీలక సూచన చేశారు. శక్తివంతమైన ప్రాంతాలకు అక్కడి చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన స్థానిక ప్రాంతానికి చెందిన స్నేహితుడు సందీప్ చేసిన సూచనలు తనకు ఎంతో నచ్చాయని విజయ్ తెలిపారు.
వరంగల్‌కు రాబోయే విమానాశ్రయానికి ‘రుద్రమదేవి అంతర్జాతీయ విమానాశ్రయం’ లేదా ‘కాకతీయ అంతర్జాతీయ విమానాశ్రయం’ అనే పేర్లను సూచించారు. ఈ పేర్లు ఓరుగల్లు గొప్ప చరిత్రను గుర్తు చేస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన విజయ్ దేవరకొండ, కొత్త విమానాశ్రయం త్వరలో వైభవంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!