
రాజకీయాలు

అయోధ్యలో కొలువైన శ్రీరాముడికి ఓ స్థానిక రైతు సమర్పించిన ప్రత్యేక నైవేద్యం భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పండును ఆయన రామలల్లాకు సమర్పించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మామిడి పండు ధర కిలోకు సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
స్థానిక ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా తులసి దళాలతో కలిసి ఈ అరుదైన మామిడి పండును సోమవారం ప్రత్యేక పూజల సందర్భంగా నైవేద్యంగా సమర్పించారు. రైతు భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన ప్రస్తుతం భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయోధ్యలో ఈ విశేష నైవేద్యం చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!