
జనరల్

రాష్ట్రంలో కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా ధృవీకరించే ఫ్యామిలీ సర్టిఫికెట్ సేవలను ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సర్టిఫికెట్‌ను తహశీల్దార్ కార్యాలయాలు మరియు మీ సేవా కేంద్రాల్లో పొందవచ్చని చెప్పారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ వివరాలను నమోదు చేసి ఈ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారని వెల్లడించారు.
ఏ ప్రభుత్వ శాఖ లేదా సంస్థ అవసరం ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మరింత సౌలభ్యం కల్పించడమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కుటుంబ వివరాల ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ సేవ ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!