
జనరల్

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగుల సెలవులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జిల్లా కేంద్రాలను విడిచి వెళ్లవద్దని సూచించింది. ప్రతి జిల్లాలో అత్యవసర సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు అవసరమైన సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
వర్షాలు, వరదల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యంగా టీజీఐఐసీ మరియు హైడ్రాతో సమన్వయం కలిగి ఉండాలని సూచించింది. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, పరిస్థితులకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!