

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె, ఇటీవల ఓ హై ఎనర్జీ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ప్రమాదానికి గురయ్యారు. ‘రణబలి’, ‘మైసా’ వంటి ప్రాజెక్టుల షూటింగ్‌లలో పాల్గొంటున్న సమయంలో, కఠినమైన డ్యాన్స్ మూమెంట్స్ కారణంగా ఆమె హిప్ ప్రాంతంలో టెండన్ డిటాచ్ అయినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో ఆమెకు తీవ్రమైన గాయం ఏర్పడింది.
వైద్యులు రష్మికకు కనీసం ఆరు వారాలపాటు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించినట్లు సమాచారం. అనంతరం ప్రత్యేక రీహాబిలిటేషన్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న పలు భారీ ప్రాజెక్టుల షూటింగ్ షెడ్యూళ్లు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. వరుస విజయాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన రష్మిక గాయపడటం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లలో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!