

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తర భారత ప్రతినిధులను ఆహ్వానించారు. ప్రజా ప్రభుత్వంగా పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాలు స్థిరంగా కొనసాగుతున్నాయని, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను నిరంతరం అమలు చేస్తున్నామని తెలిపారు.
ఫార్చ్యున్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆకాంక్షిస్తున్నామని సీఎం వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచడం లక్ష్యమని పేర్కొన్నారు. సీఐఐ ప్రతినిధులు తెలంగాణ పారిశ్రామిక విధానాలను ప్రశంసిస్తూ, మౌలిక వసతులు, ప్రభుత్వ సహకారం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!