

తిరునెల్వేలి జిల్లా కేటీసీ నగర్‌కు చెందిన 89 ఏళ్ల భవన నిర్మాణ కాంట్రాక్టర్ పేచ్చిముత్తు ఫిర్యాదు మేరకు ప్రముఖ యూట్యూబర్ మధుమితపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగర్‌కోవిల్‌కు చెందిన మధుమితతో పేచ్చిముత్తుకు పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఆమెతో కలిసి వాహనంలో ప్రయాణించిన అనంతరం, ఆమెను ఓ బస్టాప్‌లో దింపి పేచ్చిముత్తు ఇంటికి వెళ్లారు. అనంతరం మెడలో చూసుకోగా ఐదు సవర్ల బంగారు గొలుసు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో మధుమితకు ఫోన్ చేసి గొలుసు గురించి ప్రశ్నించగా, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనను అవమానిస్తానని బెదిరించినట్లు పేచ్చిముత్తు ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాజాక్కమంగళం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధుమితపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా, యూట్యూబ్‌లో నగలు, డబ్బును ప్రదర్శించే మధుమిత ఇంట్లో రెండు వారాల క్రితం భారీగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు కూడా ఆమెకు సంబంధించిన వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!