

ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా యాక్షన్ ఫిక్షన్ చిత్రం ‘వెట్టువం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్య, శోభితా ధూళిపాళ్ల, వి.ఆర్. దినేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయినట్లు సమాచారం. అయితే, చివరి నిమిషంలో దర్శకుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కథకు మరింత ఆసక్తి జోడించేందుకు, సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు అదనంగా మూడు రోజుల షూటింగ్‌ను ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రత్యేక షెడ్యూల్‌లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన పవర్‌ఫుల్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ‘విక్రమ్’ చిత్రంలో సూర్య పోషించిన ‘రోలెక్స్’ పాత్ర మాదిరిగానే, ‘వెట్టువం’లో దుల్కర్ క్యామియో కూడా కథపై గట్టి ప్రభావం చూపిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే, అదనపు షూటింగ్, దుల్కర్ పాత్రకు సంబంధించిన వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!