

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో పలు వార్తలు ప్రచారమవుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ వినిపించిన ఫైనల్ డ్రాఫ్ట్ అల్లు అర్జున్‌కు నచ్చకపోవడంతో సినిమాను రద్దు చేశారనే ప్రచారం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ పుకార్లకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఈ ప్రచారంపై అల్లు అర్జున్ పీఆర్ టీమ్ స్పందించి, సినిమా రద్దయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో బన్నీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ చిత్రాన్ని అల్లు అర్జున్ పూర్తి చేసిన తర్వాత లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!