

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు మేకర్స్ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలవనున్న ఈ ఫైట్ సీన్‌ను నవంబర్ మొదటి వారంలో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ గత చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలకు భిన్నంగా, అత్యంత సహజంగా ఈ పోరాట ఘట్టాన్ని రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ వార్తలు నిజమైతే తెరపై అల్లు అర్జున్ చేసే స్టంట్స్ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మాఫియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ‘రాకా’ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అయితే, ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!