
జనరల్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల శివరతన్ మహీయా జైపూర్ నుంచి ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో రూ.60 లక్షల విలువైన దొంగనోట్లను తరలిస్తుండగా జీఆర్‌పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.500 ముఖ విలువ కలిగిన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో కేవలం రూ.20 వేల కమిషన్ కోసం ఈ అక్రమ రవాణాకు అంగీకరించినట్లు నిందితుడు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఓం ప్రకాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నకిలీ కరెన్సీ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!