

బాలీవుడ్ నటి అనన్య పాండే పేరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా కుమారుడు ఆరవ్ భాటియాతో ఆమె డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇటీవల మనీష్ మల్హోత్రా పుట్టినరోజు వేడుకలో ఆరవ్‌తో కలిసి అనన్య దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్తలకు తెరలేచింది. ఇద్దరూ కలిసి కనిపించడంతో అభిమానుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. గతంలో అనన్య పాండే పేరు ఆదిత్య రాయ్ కపూర్‌తో ముడిపడి వార్తల్లో నిలిచింది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత విడిపోయారనే వార్తలు కూడా వినిపించాయి.
ఇప్పుడు ఆరవ్ భాటియాతో అనన్య కనిపించిన ఫొటో కొత్త చర్చకు కారణమైంది. వీరిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందా? లేక అంతకుమించిన అనుబంధం ఏమైనా ఉందా? అంటూ నెటిజన్లు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖుల కుటుంబాలకు చెందిన ఇద్దరు ఇలా కలిసి కనిపించడంతో ఈ విషయం మరింత వైరల్ అవుతోంది. అయితే ఈ డేటింగ్ వార్తలపై ఇప్పటివరకు అనన్య పాండే కానీ, ఆరవ్ భాటియా కానీ స్పందించలేదు. తమ మధ్య సంబంధం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ ఊహాగానాలుగానే ఉన్నాయి. వీరిద్దరూ ఈ ప్రచారంపై ఎప్పుడు స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!