
సినిమాలు

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం దర్శకుడు శివ నిర్వాణతో ‘ఇరుముడి’ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మరోవైపు ‘రాజా రాజా చోర’ ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఇటీవల వరుస చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, ఈసారి విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని రవితేజ ప్రయత్నిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో రవితేజ ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘అక్కాయిలు బాగున్నారా?’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ వార్తల నిజానిజాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!