

బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ‘కల్కి 2’ తెరకెక్కుతోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌కు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ప్రభాస్ డేట్స్ ఖరారైన నేపథ్యంలో అక్టోబర్ మూడో వారం నుంచి భారీ షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు నాగ్ అశ్విన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. కమల్ హాసన్ యాస్కిన్‌గా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, ప్రభాస్ భైరవగా కనిపించనున్న ఈ సీక్వెల్‌లో కీలక ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
నాగ్ అశ్విన్ ప్రణాళిక ప్రకారం 2027 మధ్య నాటికి షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాయి పల్లవి ఈ సినిమాలో శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో వైరల్ అవుతున్నాయి. ఆమె పాత్ర కథలో కీలక మలుపుకు కారణమవుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అక్టోబర్‌లో వైజయంతీ మూవీస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని చెబుతుండగా, సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!