

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ విజువల్ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం మేకర్స్ గతంలో అనుకున్న ప్రణాళిక ప్రకారం కొన్ని ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ప్రచార కార్యక్రమాలు కొంత నెమ్మదించాయి. ప్రస్తుతం సినిమా డబ్బింగ్ పనులు కూడా ముందుకు సాగుతున్న నేపథ్యంలో కొత్త ప్రమోషనల్ కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
త్వరలోనే సినిమా నుంచి మరో ప్రోమో లేదా ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ కంటెంట్ వచ్చినా సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘విశ్వంభర’ జనవరి మొదటి వారంలో విడుదల కావచ్చనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కానీ చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి, గౌర హరి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!