

రాబోయే ప్రతి సినిమాతో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకుంటున్నాడు రామ్ పోతినేని. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడిగా రామ్ పరిచయం కాబోతున్న సినిమా ఇప్పటికే భారీ అంచనాలను పెంచుతోంది. కేవలం ‘కథ, దర్శకత్వం రామ్ పోతినేని’ అనే ఒక్క ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టడం విశేషంగా మారింది.
మరోవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి సినిమా చేసే అవకాశం కూడా రామ్ పరిధిని మరింత పెంచబోతోందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు టాలీవుడ్‌లో తనకంటూ ఒక మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్న ఆయన, ఇప్పుడు ఇతర భాషల్లోనూ గుర్తింపు సంపాదించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు కార్యరూపం దాలిస్తే రామ్ కెరీర్‌కు కొత్త దిశ లభించే అవకాశం ఉంది. వరుసగా విభిన్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న రామ్ పోతినేనికి రాబోయే రోజులు మరింత కీలకం కానున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!