

నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని సినీ రంగ ప్రవేశంపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆమె కథానాయికగా పరిచయమవుతారని ప్రచారం జరగగా, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. నటన కంటే నిర్మాణ రంగంపై ఆసక్తి చూపిస్తున్న ఆమె, నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తన క్లాస్‌మేట్ భువన్ దర్శకత్వంలో ఓ కొత్త తరహా కథతో సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సింధూరపువ్వు కృష్ణారెడ్డి తనయుడు అన్వేష్ కథానాయకుడిగా కనిపించనుండగా, బాబీ సింహా కీలక పాత్రలో నటించనున్నారట. నవంబర్ 23న విశాఖపట్నంలోని గీతం ఇంజనీరింగ్ కాలేజీలో చిత్రీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తేజస్విని నిర్మాతగా ఎలాంటి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనే ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!