
జనరల్

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న 'డోరతి' చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
మరోవైపు, నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రంలో కీర్తి సురేష్ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 25న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఒకే రోజున హీరోయిన్‌గా ఒక సినిమాలో, స్పెషల్ సాంగ్‌తో మరో సినిమాలో కీర్తి సురేష్ ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!